prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 11:45 am Digital Edition : PRAJA VANI

విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా

విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా

పాఠశాలలో అల్పాహార కార్యక్రమం ప్రారంభం

పోత్కపల్లి: విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యా సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అల్పాహార కార్యక్రమాన్ని పోత్కపల్లి పాఠశాలలో సోమవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి గౌరవ పోత్కపల్లి గ్రామ సర్పంచ్ ఆంబాల సారమ్మ, ఉపసర్పంచ్ రెడ్డి రజనీకాంత్, వార్డు సభ్యులు, పాఠశాల ఏఏపీసీ (AAPC) చైర్మన్ పిట్టల మమత, ఏఏపీసీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది హాజరై విద్యార్థులకు అల్పాహారాన్ని అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉండటంతో పాటు, పాఠశాలలో చురుకుగా పాల్గొని చదువుపై మరింత ఏకాగ్రత సాధించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి పోషకాహారం ఎంతో అవసరమని తెలిపారు.

గ్రామ ప్రజాప్రతినిధులు, ఏఏపీసీ సభ్యులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించడం పట్ల పాఠశాల వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అల్ల సుమన్ రెడ్డి, గౌరవ పోత్కపల్లి గ్రామ సర్పంచ్ ఆంబాల సారమ్మ, ఉపసర్పంచ్ రెడ్డి రజనీకాంత్, వార్డు సభ్యులు, పాఠశాల ఏఏపీసీ చైర్మన్ పిట్టల మమత, ఏఏపీసీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు.