prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 4:35 pm Digital Edition : PRAJA VANI

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి

*విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి*

*జనగాం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జితేందర్ రెడ్డి*

*కళాశాల విద్య – భవిష్యత్తుకు బాట*

*జిజేసి జనగాం ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26(ప్రజావాణి):
జిల్లా కేంద్రం లోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇయర్లో చేరిన నూతన విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం చెబుతూ ఏర్పాటు చేసిన ప్రెషర్స్ డే కార్యక్రమం శనివారం కళాశాల ప్రిన్సిపల్ నాముని పావని కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో జనగాం జిల్లా ఇంటర్మీడియట్ విద్య శాఖ అధికారి జితేందర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా డి ఐ ఈ ఓ జితేందర్ రెడ్డి విద్యార్థులను, అధ్యాపకులను ఉద్దేశించి మాట్లాడుతూ కళాశాల విద్య మీ భవిష్యత్తుకు మంచి బాట అని కాలేజీలో ఉచితంగా లభించే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, కాలేజీ బ్యాగ్స్, షూ లాంటివి పంపిణీ చేయడం జరిగిందని ఇంకా క్లాస్ రూమ్ ల లో, ల్యాబ్ లలో అనేక సౌకర్యాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకొవాలని సూచించారు.
ఉత్తమ విద్యను పొంది అంకిత భావంతో చదివి, ఒక లక్ష్యంతో కృషి చేస్తూ, ఉత్తమ క్రమశిక్షణను పాటిస్తూ కాలేజీ విద్య ను మీ భవిష్యత్తులో బంగారు బాటగా మలుచుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులకు సూచించారు.
పేద విద్యార్థులు చదువుకునే ఈ కాలేజీలో అధ్యాపకులు వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసి వంద శాతం ఫలితాలు తీసుకురావాలని సూచించారు. కళాశాల స్టాఫ్ సెక్రటరీ వై శ్రీకాంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాల విద్యావరకు మిమ్మల్ని తల్లిదండ్రులు, టీచర్లు నడిపించారు. కానీ కళాశాల విద్య అంటే మిమ్మల్ని మీరు నడిపించుకోవడం నేర్చుకోవడం. ఉద్యోగం కోసమే కాదు, ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగండి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్. కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మరిపెల్ల రవి ప్రసాద్, అధ్యాపక అధ్యాపకేతర బృందం విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.