విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
*మన ప్రజావాణి*
మంచిర్యాల ప్రతినిధి సెప్టెంబర్ 30
ప్రభుత్వ విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నెన్నెల మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అదనపు గదులు, వంటశాల, తరగతి గదులు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు మెనూ ప్రకారం సకాలంలో రుచికరమైన పౌష్టిక ఆహారం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
అన్ని ప్రభుత్వ పాఠశాలలలో సకల సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు..