విజేతలను అభినందించిన కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి రాష్ట్రస్థాయి టూరిజం పోటీల్లో నాగార్జున ప్రభుత్వ కళాశాల (అటానమస్), నల్గొండ విద్యార్థులు తమ సృజనాత్మక ప్రతిభను చాటుకున్నారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన టూరిజం పోటీల్లో మూడు విభాగాల్లో అవార్డులు సాధించి ఘనత సాధించారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా ఉన్నారు. పర్యాటకంపై అవగాహన, తెలంగాణ చారిత్రక –సాంస్కృతిక వారసత్వం, స్థానిక పర్యాటక ప్రదేశాల ప్రాధాన్యత, సృజనాత్మకత, సామాజిక భాగస్వామ్యం వంటి అంశాలను ప్రోత్సహించే విధంగా వివిధ...