విఘ్నేశ్వరుని సన్నిధిలో భక్తి వైభవం
విఘ్నేశ్వరుని సన్నిధిలో భక్తి వైభవం 75 రకాల నైవేద్యాలతో ముదిరాజ్ యూత్ ఆధ్వర్యంలో విశేష పూజలు పోత్కపల్లి, సెప్టెంబర్ 21: పోత్కపల్లి గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పోత్కపల్లి ముదిరాజ్ యూత్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర స్వామివారికి గణపతి పూజ, కుంకుమ పూజలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా స్వామివారికి 75 రకాల నైవేద్యాలను సమర్పించి భక్తిభావాన్ని చాటుకున్నారు. ఉదయం నుంచే ముదిరాజ్ యూత్ సభ్యులు, భక్తులు పూజా కార్యక్రమాలకు హాజరై విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు, భక్తి...