విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జనగామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి
*విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జనగామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి - ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 21(ప్రజావాణి): జనగామ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఘనంగా కొనసాగుతున్నాయి. గణపతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టణంలోని పలు గణపతి మండపాలను సందర్శిస్తూ భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని 18వ వార్డులో శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు....