prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 8:29 pm Digital Edition : PRAJA VANI

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జనగామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి

*విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జనగామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి – ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 21(ప్రజావాణి):
జనగామ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఘనంగా కొనసాగుతున్నాయి. గణపతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టణంలోని పలు గణపతి మండపాలను సందర్శిస్తూ భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా పట్టణంలోని 18వ వార్డులో శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 22వ వార్డులోని పలు గణపతి మండపాలను సందర్శించి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు, భక్తులు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు.

*ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…*

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జనగామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.
శ్రీ విఘ్నేశ్వర ఆలయ అభివృద్ధికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే స్పందించి షెడ్ నిర్మాణానికి కృషి చేశానని, ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.
పట్టణంలో కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసి గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
పండుగలు కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా ప్రజల మధ్య ప్రేమ, సోదరభావం, ఐక్యతను మరింత పెంపొందించేలా ఉండాలని, జనగామ ప్రజల సంతోషమే నాకు ముఖ్యమైనదని,అభివృద్ధితో పాటు ఆలయాలు, పుణ్యక్షేత్రాల అభివృద్ధికి కూడా నా వంతు సహకారం ఉంటుందన్నారు.