విఘ్నహర్త యూత్ ఆధ్వర్యంలో అన్నదానం
ఘట్కేసర్, సెప్టెంబర్ 19 (ప్రజావాణి): ఘట్కేసర్ 6వ డివిజన్ బాలాజీనగర్‌లో విఘ్నహర్త యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఘట్కేసర్ మాజీ చైర్‌పర్సన్ ముల్లిపావని జంగయ్య యాదవ్, ఘట్కేసర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్‌రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు తోక మల్లేష్ హాజరై అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సునీల్, రామకృష్ణ, మహేష్, అనిల్, నరేష్, రామ్, సాయి తదితరులు పాల్గొన్నారు. మండప నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.