prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 6:30 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

వాలిడేషన్ చట్టాన్ని కేంద్రం వెంటనే రద్దు చేయాలి!

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపుమేరకు దేశవ్యాప్త పోరాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టి ఎ పి ఎ) నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెన్షనర్లు బుధవారం 30 సెప్టెంబర్ 2026 బుధవారం కలెక్టర్ ఆఫీస్ ఉదయం 11 గంటలకు నిరసన ప్రదర్శన మరియు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ పరిపాలనాధికారి యం. మోతీలాల్ కి పెన్షనర్ల డిమాండ్ల మెమోరాండమును సమర్పించడం జరిగింది. ధర్నాకు అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు నూకల జగదీష్ ప్రభుత్వం మాట్లాడుతూ….. ఈ పోరాటం యొక్క ఉద్దేశ్యం పెన్షనర్ల హక్కులపై జరుగుతున్న దాడులను, ముఖ్యంగా *పెన్షన్ రూల్స్ వాలిడేషన్ చట్టం-2025, వివక్షత తో కూడిన వైపీఎస్ మరియు 8వ సిపిసి టిఒఆర్ లో పింఛన్ రివిజన్‌ని మినహాయించి నిరసన తెలియజేయడం జరుగుతుందని 12 అంశాల డిమాండ్లను వినండి. మార్చి 2025 లో పార్లమెంటు ఆమోదించిన పెన్షన్ రూల్స్ (వాలిడేషన్ చట్టం-2025) ను ఉపసంహరించుకోవాలి. డి.ఎస్. నకారా తీర్పును గౌరవించాలి. ప్రతి పే కమీషన్ లో పెన్షన్ రివిజన్ ను నిర్ధారించాలి. 01-01-2026 కి ముందు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ రివిజన్ ను చేర్చడానికి 8 వ సిపిసి యొక్క టర్ముస్ ఆఫ్ రిఫరెన్స్ ను సవరించాలి. 8 వ సిపిసి సిఫార్సుల సమర్పణ మరియు అమలులో జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని మధ్యంతర భృతి అందించాలి. 50% డిఎ/డిఆర్ ను పే / పెన్షన్ లో విలీనం చేయాలి. 10 సంవత్సరాల 8 నెలల తర్వాత కమ్యుటేషన్ పునరుద్ధరణ. పెన్షన్ లో సమానత్వాన్ని నిర్ధారించాలి. కుటుంబ పెన్షన్ రేట్లను మరియు వివక్షతతో కూడిన నిబంధనలను తొలగించాలి. ఎన్ పి ఎస్ మరియు యుపిఎస్ లను రద్దు చేయాలి. రాష్ట్ర, కేంద్ర, పి ఎస్ యూ స్వయం ప్రతిపత్తి సంస్థల ఉద్యోగులందరికీ గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ తో సహా పూర్తి ప్రయోజనాలతో ఒపిఎస్ ను ప్రారంభించాలి. పిఎఫ్ఆర్డిఎ బిల్లును రద్దు చేయాలి. “కరోనా కాలం” నాటి 18 నెలల పెండింగ్ డి ఎ/డి ఆర్ ను వెంటనే విడుదల చేయాలి.
సీనియర్ సిటిజన్లకు రైల్వే మరియు విమాన టిక్కెట్లలో 50% రాయితీని పునరుద్ధరించాలి. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతో సమానంగా డి ఎ/డిఆర్ అందేలా చూడాలి. ప్రజా / ప్రభుత్వ ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలి. పెన్షనర్లు / సీనియర్ సిటిజన్లకు క్యాష్ లెస్ వైద్య సౌకర్యాలను కల్పించాలి. స్థిర వైద్య భత్యాన్ని తగిన విధంగా పెంచాలి. 65 నుండి 75 సంవత్సరాల వయస్సు వరకు ప్రతి 5 సంవత్సరాలకు 10% పెన్షన్ పెంచాలి, 80 సంవత్సరాల వయస్సు పొందిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు 20% పెన్షన్ పెంచాలి. పెన్షనర్ల ఫిర్యాదులను పరిష్కరించేందుకు సీనియర్ సిటిజన్ల కోసం చట్టబద్ధమైన జాతీయ కమీషన్ ను ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు ఎండీ అబ్దుల్ ఖాదర్, జిల్లా ఆర్థిక కార్యదర్శి మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు కుకుడాల గోవర్ధన్, సీనియర్ నాయకులు పాతూరి విద్యాసాగర్ రెడ్డి, జిల్లా మరియు డివిజన్ కార్యదర్శులు గుండాల బిక్షమయ్య, రాపోలు వెంకటేశం, పులి కృష్ణమూర్తి మిర్యాల కేశవులు జి.సత్యనారాయణ చేపూరి పరశురాములు, రిటైర్డ్ ఎండీవో రాయపాటి, కేపచర్ల అనంతరెడ్డి, కేపచర్ల అనంతరెడ్డి, అబ్దుల్ అమీద్ ఖాన్, కే .దేవచిత్తం, వనమా నరసింహ, డి. ప్రభాకర్ ,ఎండి జబ్బార్, ఏ .లక్ష్మీనారాయణ, వి. యాదగిరి, ఏం . భాస్కర్ రెడ్డి, ఏ. వెంకటయ్య , ఎస్.కె.అబ్దుల్ ఖాదర్, షేక్ అస్కర్ సాధించారు.