*వాటర్ ట్యాంక్ వద్ద అపరిశుభ్రత.. తాగునీటిపై గ్రామ ప్రజలు అధికారులపై. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*మిషన్ భగీరథ ద్వారా గ్రామ ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటి విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.*
గ్రామంలోని వాటర్ ట్యాంక్ లోపల అపరిశుభ్రత, ట్యాంక్ చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజూ ప్రజలు తాగునీటిగా వినియోగించే నీటిని నిల్వ చేసే వాటర్ ట్యాంక్ పరిసరాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాల్సి ఉన్నప్పటికీ, సరైన నిర్వహణ లేకపోవడంతో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మిషన్ భగీరథ నీటిని ప్రజలు నిత్యం తాగుతున్న నేపథ్యంలో నీటి ట్యాంకుల పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు.
ట్యాంక్‌ను ఎప్పటికప్పుడు శుభ్రపరచకపోతే నీటి నాణ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని, దీంతో ప్రజల ఆరోగ్యంపై కూడా ఆందోళన నెలకొంటుందని స్థానికులు అంటున్నారు. గ్రామంలో తాగునీటి సరఫరాలో ఎక్కడైనా అంతరాయాలు, నీటి కలుషితంపై అనుమానాలు ఉంటే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
వాటర్ ట్యాంక్‌ను అధికారులు తక్షణమే పరిశీలించి, లోపల పూర్తిస్థాయిలో శుభ్రపరిచడంతో పాటు ట్యాంక్ చుట్టూ పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీరు అందేలా సంబంధిత అధికారులు పర్యవేక్షణ పెంచాలని కోరుతున్నారు.