prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 9:31 am Digital Edition : RAJASHEKARREDDY

వాగులో చనిపోయిన కుక్కను పడేయడంతో ప్రజలకు ఇబ్బందులు

బెజ్జంకి, సెప్టెంబర్ 1 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో చనిపోయిన కుక్కను వాగులో పడేయడంతో వాహనదారులు, చుట్టుపక్కల నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చనిపోయిన కుక్కను వాగులో పడేయడంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు పరిసర ప్రాంతాల్లో అసౌకర్యకర పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు తెలిపారు. దీంతో ప్రజల ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు వెంటనే స్పందించి వాగులో పడేసిన చనిపోయిన కుక్కను తొలగించడంతో పాటు, బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.