వర్షాలకు కుప్పకూలిన ఇల్లు.. ఇందిరమ్మ ఇల్లు కోసం వేడుకోలు!

వర్షాలకు కుప్పకూలిన ఇల్లు.. ఇందిరమ్మ ఇల్లు కోసం వేడుకోలు! నిరాశ్రయులైన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని బాధితుడి విజ్ఞప్తి తంగళ్లపల్లి, సెప్టెంబర్‌ 19, ప్రజావాణి: ఇటీవల కురిసిన వర్షాలకు తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లె గ్రామంలో ఓ పేద కుటుంబం ఇల్లు కుప్పకూలింది. గ్రామానికి చెందిన నకీర్తి బాలయ్యకు చెందిన ఇల్లు శనివారం వేకువజామున ఒక్కసారిగా కూలిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో ఎవరూ గాయపడకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇల్లు పూర్తిగా దెబ్బతినడంతో కుటుంబం తలదాచుకునేందుకు...