వర్షాన్ని లెక్కచేయని వ్యాపారులు వినాయక పత్రి పూలమాలల సందడి

వర్షాన్ని లెక్కచేయని వ్యాపారులు.. వినాయక పత్రి, పూలమాలల సందడి కూకట్‌పల్లి, జెఎన్టీయూ రోడ్ (ప్రజావాణి) సెప్టెంబర్ 13: వినాయక చవితి సందర్భంగా కూకట్‌పల్లి జెఎన్టీయూ రోడ్డులో వర్షం కురుస్తున్నప్పటికీ వినాయక పత్రి, బంతి పూలమాలల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వ్యాపారులు తమ దుకాణాలను కొనసాగిస్తూ భక్తులకు అవసరమైన పూజా సామగ్రిని అందుబాటులో ఉంచుతున్నారు. వినాయకుడి పూజ కోసం పత్రి, బంతి పూలమాలలు కొనుగోలు చేసేందుకు ప్రజలు సైతం వర్షంలో మార్కెట్‌కు తరలివస్తున్నారు. దీంతో జెఎన్టీయూ రోడ్డులో పండుగ సందడి నెలకొంది.