prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 10:28 am Digital Edition : MINIPALLYNARESH KUKATPALLY

వర్షంలోనూ తగ్గని రద్దీ.. జేఎన్‌టీయూ రోడ్డులో ట్రాఫిక్ జామ్

వర్షంలోనూ తగ్గని రద్దీ.. జేఎన్‌టీయూ రోడ్డులో ట్రాఫిక్ జామ్

వినాయక చవితి పత్రి, పూలమాలలు కొనుగోళ్లకు తరలివచ్చిన ప్రజలు

కూకట్‌పల్లి, ప్రజావాణి – సెప్టెంబర్ 13:

వర్షం కురుస్తున్నప్పటికీ వినాయక చవితి పర్వదినం సందర్భంగా కూకట్‌పల్లి జేఎన్‌టీయూ రోడ్డులోని రైతు బజార్ మార్కెట్‌కు ప్రజలు భారీగా తరలివచ్చారు. వినాయక పత్రి, పూలమాలలు, పండ్లు కొనుగోలు చేసేందుకు ఉదయం నుంచే మార్కెట్‌లో సందడి నెలకొంది.

ఆదివారం కావడంతో రద్దీ మరింత పెరగడంతో జేఎన్‌టీయూ రోడ్డుపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయి ట్రాఫిక్ నెమ్మదిగా సాగింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు పండుగ కొనుగోళ్లకు తరలిరావడంతో మార్కెట్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.