వరుస దొంగతనాలు చేసున్న ముఠా సభ్యులను అరెస్టు చేసిన కాశీబుగ్గ పోలీసులు
ఒడిశాకు చెందిన ముగ్గురు దొంగలను పట్టుకున్న పోలీసులు
రూ.32.50 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం
పలాస, ప్రజావాణి ప్రతినిధి
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్‌డివిజన్ పరిధిలో రాత్రి సమయాల్లో ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వజ్రపుకొత్తూరు మండలం వెంకటాపురం బ్రిడ్జి సమీపంలోని సర్వీసు రోడ్డులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
.ఒడిశా రాష్ట్రానికి చెందిన బెనియ దుర్గాప్రసాద్, దేబా మండల్,పొట్నూరు మిన్నారావులు,పాత టెక్కలి,పద్మాపురం,పాతపట్నం ప్రాంతాల్లో నాలుగు చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
నిందితుల వద్ద నుంచి 17 తులాల బంగారం, 1,640 గ్రాముల వెండి వస్తువులు,రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు మొత్తం విలువ సుమారు రూ.32.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.అదేవిధంగా మరో 10 తులాల బంగారాన్ని పర్లాకిమిడిలోని బ్యాంకుల్లో తాకట్టు పెట్టినట్లు గుర్తించామని,ఆ బంగారాన్ని కూడా త్వరలో రికవరీ చేస్తామని పోలీసులు వెల్లడించారు
.కేసును ఛేదించిన పోలీసు అధికారులు మీడియా సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ పి. శ్రీనివాసు రావు, డిఎస్పీ భవానీ, రూరల్ సీఐ తిరుపతి, క్రైమ్ సీఐ చంద్ర మౌళి, ఎస్ఐ లు భారత్ క్రైమ్ పోలీసులు పాల్గొన్నారు..