వంటమాస్టర్ కుమారుడికి అన్నప్రాసన చేసిన ఝాన్సీ రెడ్డి

*వంటమాస్టర్ కుమారుడికి అన్నప్రాసన చేసిన ఝాన్సీ రెడ్డి* జనగామ జిల్లా ప్రతినిధి , సెప్టెంబర్ 22(ప్రజావాణి): టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి మానవత్వానికి, ఆప్యాయతకు నిదర్శనంగా నిలిచారు. తమ ఇంటి వద్ద వంట చేస్తున్న రాజు కుమారుడికి తమ సొంత బిడ్డలా భావించి సంప్రదాయబద్ధంగా అన్నప్రాసన కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని స్వయంగా అన్నం తినిపించి ఆశీర్వదించారు. చిన్నారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, విద్యా...