వంగపల్లి శివాలయంలో ఘనంగా మహా అన్నదానo
ప్రజావాణి సెప్టెంబర్ 20
వంగపల్లి గ్రామంలో శివాలయంలో బాలమిత్ర బృందం ఆధ్వర్యంలో మహా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు విశ్వేశ్వరుని ఆవరణలో భక్తుల ఆరాధనలు పూజా కార్యక్రమాల మధ్య భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం కొనసాగింది
ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు బాలమిత్ర బృందం సభ్యులు భక్తిశ్రద్ధలతో అన్నదానాన్ని వడ్డించారు అన్నదాన కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో ప్రసాదాన్ని స్వీకరించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు

అన్నదానం మహాదానం అనే భావనతో బాలమిత్ర బృందం సభ్యులు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చిన్న వయసులోనే సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వాములు కావడం అభినందనీయమని గ్రామ ప్రజలు పేర్కొన్నారు