లారీ ఓనర్స్ సంక్షేమ సంఘం గణపతిని దర్శించుకున్న ఆర్టీవోవంశీకృష్ణ
* హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
జమ్మికుంట సెప్టెంబర్ 17 (ప్రజావాణి)
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జమ్మికుంట లారీ ఓనర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారుఈ కార్యక్రమానికి ఆర్టీవో వంశీకృష్ణ హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారుఈ సందర్భంగా నిర్వాహకులు ఆర్టీవో వంశీకృష్ణకు ఘనంగా స్వాగతం పలికారుగణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలు, భక్తులు ఉత్సవాల్లో ఆధ్యాత్మిక భావంతో పాల్గొని విజయవంతం చేయాలని కోరారులారీ ఓనర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్రతిరోజూ ప్రత్యేక పూజలు భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులుతెలిపారుభక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారుఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మారపల్లి రామస్వామి ఉపాధ్యక్షుడు వజ్జేపల్లి శ్రీనివాస్ సంఘం సభ్యులు నిర్వాహకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు