లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత
*లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత* *కోదాడ సెప్టెంబర్ (ప్రజావాణి)*: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కులను కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి యర్రవరం గ్రామానికి చెందిన లబ్ధిదారు బారు సత్యావతికి తన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థికంగా అండగా నిలుస్తోందన్నారు. వైద్య చికిత్సల ఖర్చులను భరించలేని కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అత్యవసర వైద్య అవసరాల...