prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 5:57 pm Digital Edition : PRAJA VANI

లద్నూర్ ప్రభుత్వ పాఠశాలలో సోషల్‌ టీచర్‌ను నియమించాలి.

లద్నూర్ ప్రభుత్వ పాఠశాలలో సోషల్‌ టీచర్‌ను నియమించాలి.

పదో తరగతి విద్యార్థుల ఇబ్బందులపై స్పందించిన… జడ్పీ సీఈవో రమేష్

లద్నూరు గ్రామ సర్పంచ్ కాసర్ల రేణుక కనకరాజు

మద్దూరు సెప్టెంబర్ 18, ప్రజా వాణి,

మద్దూరు మండల పరిధిలోని లద్నూర్ ప్రభుత్వ పాఠశాలలో సోషల్‌ సబ్జెక్టు ఉపాధ్యాయుడి కొరతను పరిష్కరించాలని గ్రామ సర్పంచ్ రేణుక కనకరాజు అధికారులను కోరారు. సోషల్‌ టీచర్‌ పదవీ విరమణ చేయడంతో గత నాలుగు నెలలుగా విద్యార్థులకు ఆ సబ్జెక్టు బోధించే వారు లేకపోవడంతో పదో తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారుఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సర్పంచ్ రేణుక కనకరాజు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సర్పంచ్ సిద్దిపేట జిల్లా జడ్పీ సీఈవో, డీఈవో రమేష్‌ను కలిసి సమస్యను వివరించారు. సోషల్‌ సబ్జెక్టు ఉపాధ్యాయుడు లేకపోవడం వల్ల పదో తరగతి విద్యార్థులు విద్యాపరంగా నష్టపోతున్నారని తెలిపారు.సమస్యపై స్పందించిన జడ్పీ సీఈవో వెంటనే సంబంధిత ఎంఈవోకు సోషల్‌ సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ ఆర్డర్‌ కాపీ అందజేశారు.విద్యార్థుల సమస్యపై తక్షణమే స్పందించిన జడ్పీ సీఈవోకు సర్పంచ్ రేణుక కనకరాజు కృతజ్ఞతలు తెలిపారు.