లద్నూరులో బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల ధర్నా
స్థానిక ప్రజా ప్రతినిధుల సంపూర్ణ మద్దతు
స్పందించని జనగామ డిపో మేనేజర్

రెండు రోజుల్లో సమస్య పరిస్కరించపోతే… నిరంతర ధర్నా
ఎస్సై ఆసిఫ్ హామీతో ధర్నా విరమించిన విద్యార్థులు
మద్దూరు సెప్టెంబర్9, ప్రజా వాణి,
మండలంలోని లద్నూరు నుండి ప్రతి రోజు జనగామ జిల్లా కేంద్రానికి విద్యా కోసం 30 మంది విద్యార్థులు బస్సులో ప్రయాణం చేసే విద్యార్థులకు జనగామ అర్ టి సి అధికారులు శాపంగా మారీ విద్యార్థుల జీవితాలతో చెలగటమడుతున్నారు.దీంతోబుదవారం లద్నూరు గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు గ్రామ ఉప సర్పంచ్ బెడద శివ కుమార్, ఎబివిపి నాయకుడు సోగాల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ముందు రోడ్డుపై రెండు గంటల పాటు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉప సర్పంచ్ శివ కుమార్, ఎబివిపి నాయకుడు సోగాల మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఎప్పటినుండో మద్దూరు, లద్నూరు, మీదుగా బచ్చన్నపేట నుండి జనగామ వెళ్ళే బస్సు విద్యార్థుల కళాశాలకు సరైనా సమయంకు వెళ్ళేవారు. గత మూడు రోజుల క్రితం జనగామ డిపో అధికారులు తమ ఇష్టారాజ్యంగా బస్సు వేళలు మార్చి బచ్చన్నపేట నుండి ఆలేరు ద్వారా హైదరాబాద్ వెళ్తుండడంతో విద్యార్థులు బచ్చన్నపేటలో దిగి జనగామకు వెళ్ళే బస్సు కోసం గంటల తరబడి వేచి ఉండడంతో విద్యార్థులు కొన్ని క్లాసులు హాజరు కాలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ హుస్నాబాద్ ఏసిపి సదానందం, జనగామ అర్ టి సి అధికారులతో సంప్రదింపులు జరిపి రెండు రోజుల్లో యధావిధిగా జనగామ వరకు వెళ్లేందుకు చర్యలు తీసుకునేవిధంగా అధికారులతో మాట్లాడి సమస్య పరిస్కరించే విధంగా కృషి చేస్తానని విద్యార్థులకు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. విద్యార్థుల ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపిన రేబర్తి పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి,గ్రామ ఉప సర్పంచ్ శివ కుమార్, మాజీ సర్పంచులు రామడుగు బాల్ రాజ్, జీడికంటి సుదర్శన్, సురేష్, ఎబివిపి నాయకుడు సోగాల మనోజ్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.