prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 10:13 am Digital Edition : PRAJA VANI

లడ్డూ వేలంలో సర్పంచ్ సంతోష్‌దే హవా

.లడ్డూ వేలంలో సర్పంచ్ సంతోష్‌దే హవా..

.రూ.41,116కు గణపయ్య లడ్డూ కైవసం!

.చౌకన్‌పల్లి గ్రామ ప్రజల సుఖసంతోషాల కోసం గణపయ్యను ప్రార్థించిన సర్పంచ్

సెప్టెంబర్ 24,(ప్రజావాణి)

నారాయణఖేడ్ నియోజకవర్గం లోని కంగ్టి మండల పరిధిలోని చౌకన్‌పల్లి గ్రామ సర్పంచ్ సంతోష్ కుమార్ దేశ్ముఖ్ గణేష్ నవరాత్రి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని అల్కాపురి కాలనీలో నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం గురువారం ఉత్కంఠభరితంగా సాగింది.గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ వేలంలో తొలి లడ్డూను దక్కించుకునేందుకు పలువురు భక్తులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ క్రమంలో చౌకన్‌పల్లి గ్రామ సర్పంచ్ సంతోష్ కుమార్ దేశ్ముఖ్ లడ్డూను దక్కించుకునేందుకు హోరాహోరీగా పోటీ పడ్డారు.చివరికి రూ.41,116కు తొలి లడ్డూను సొంతం చేసుకున్నారు.లడ్డూ వేలం సందర్భంగా అల్కాపురి కాలనీ భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో అక్కడ సందడి నెలకొంది. వేలం ఉత్కంఠభరితంగా సాగడంతో భక్తుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష్ కుమార్ దేశ్ముఖ్ మాట్లాడుతూ, గణపయ్య ఆశీస్సులతో చౌకన్‌పల్లి గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామంపై వినాయకుడి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గణేష్ నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.