లక్ష్మీపూర్‌లో ఉల్లాస్ వయోజన విద్యా పరీక్షలు
బెజ్జంకి, సెప్టెంబర్ 27 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ‘ఉల్లాస్’ కార్యక్రమంలో భాగంగా వయోజన విద్యా పరీక్షలను నిర్వహించారు. వృద్ధులు, నిరక్షరాస్యులకు లెక్కలు చేయడం, బొమ్మలు–వస్తువులను గుర్తించడం, ఖాళీలను పూరించడం తదితర అంశాలపై శిక్షణ అందించారు.అనంతరం మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన పరీక్షలను సర్పంచ్ ముక్కిస కవిత సమక్షంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ముక్కిస కవిత మాట్లాడుతూ చదువు నేర్చుకోవడం ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమని, చదువుకు వయస్సుతో సంబంధం లేదని అన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ అక్షర జ్ఞానం పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సీఏలు పద్మ, లావణ్య, వీఓలు మానెవ్వ, పర్మీనా, కార్యదర్శి లక్ష్మీ, కోశాధికారి లావణ్యతో పాటు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.