prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 8:24 pm Digital Edition : SRIKANTH MULUGU

లక్ష్మీదేవిపేట గ్రామ ప్రజలకు స్వాగతం – సుస్వాగతం

 

లక్ష్మీదేవిపేట(ప్రజావాణి)

లక్ష్మీదేవిపేట గ్రామ ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా..మన గ్రామంలో గత 40 సంవత్సరాలుగా ఉంటూ, లక్ష్మీదేవిపేట పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా సేవలందించి రిటైర్డ్ అయిన కీర్తిశేషులు శ్రీ అంబటి జగన్నాథ రాజు గారు (బట్టు సారు / రాజు సార్) మరియు వారి ధర్మపత్ని శ్రీమతి వినోదం గారు.
వారి పెద్ద కుమారుడు లయన్ అంబటి రమణాకర్ రాజు, స్రవంతి కుమారులు శ్రీ సాయి వికాస్ రాజు, అక్షయ రాజు కుటుంబం తరఫున…
మన గ్రామంలో సొంత ఇల్లు లేకపోయినా, గ్రామం మీద ఉన్న మమకారంతో గత మూడు సంవత్సరాలుగా వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి, గ్రామ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా త్రివేణి సంగమమైన పవిత్ర కాళేశ్వరంలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రతి సంవత్సరం వేల రూపాయలు ఖర్చు చేస్తూ, గ్రామం మీద ఉన్న ప్రేమాభిమానాలను చాటుకుంటూ, ఆధ్యాత్మికంగా, పాఠశాల అభివృద్ధిలో తన వంతు సేవలందిస్తున్నారు.
రేపు వినాయక పూజ నిమిత్తం విచ్చేస్తున్న వారి కుటుంబ సభ్యులందరికీ లక్ష్మీదేవిపేట గ్రామ ప్రజల తరఫున, వినాయక చవితి ఉత్సవ కమిటీ తరఫున హృదయపూర్వక స్వాగతం – సుస్వాగతం పలుకుతూ, ధన్యవాదాలు, కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నాము. ఇలాంటి సేవలు మున్ముందు మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాము.