రోడ్లు,ఉద్యోగాలపై ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్‌ఎస్‌ నేత రఘు

హుజూర్నగర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ప్రభంజనం ఖాయం...పిల్లుట్ల రఘు నేరేడుచర్ల, సెప్టెంబర్‌ 15 (ప్రజావాణి): రాబోయే రోజుల్లో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించబోతుందని బీఆర్‌ఎస్‌ హుజూర్‌నగర్‌ నియోజకవర్గ నాయకుడు పిల్లుట్ల రఘు అన్నారు. మంగళవారం నేరేడుచర్ల మండలం మూసి ఒడ్డు తండాలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మండలంలోని పులగంబండ తండా, చిల్లేపల్లి, చింతకుంట్ల, బూరుగుల తండా, ముకుందాపురం, దాసారం, పెంచికల్‌దిన్నె గ్రామాలతో పాటు నేరేడుచర్ల పట్టణంలోని వివిధ వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక...