రోడ్లపై యువత చక్కర్లు.. చేజారుతున్న భవిష్యత్తు
*రోడ్లపై యువత చక్కర్లు.. చేజారుతున్న భవిష్యత్తు!* *రాయికల్, సెప్టెంబర్ 24 (ప్రజావాణి):* మండలంలోని పలు గ్రామాల్లో యువత దారి తప్పుతోంది. చదువు, ఉపాధి, ఎలాంటి పని లేకుండా రోజంతా బైకులు పట్టుకుని రోడ్ల మీద అటూ ఇటూ చక్కర్లు కొడుతూ కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. చేతిలో సెల్ ఫోన్, చెవిలో ఇయర్ ఫోన్లు, మితిమీరిన వేగంతో బైక్ రేసులు, విన్యాసాలు చేస్తూ తమ ఉజ్వల భవిష్యత్తును తమ చేతులారా నాశనం చేసుకుంటున్నారు.ఉదయం నుంచి రాత్రి వరకు కూడళ్లలో, ప్రధాన రహదారులపై, ఖాళీ ప్రదేశాల్లో గుంపులుగా...