prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 1:02 pm Digital Edition : PRAJA VANI

రోడ్డు నిర్మాణంలో తేడాలెందుకు?

రోడ్డు నిర్మాణంలో తేడాలెందుకు?

అధికారులను ప్రశ్నించిన జన్ను కిషన్.. వెంటనే రంగంలోకి ఈఈ రాజ్‌కుమార్

కొన్ని చోట్ల వెడల్పు.. మరికొన్ని చోట్ల ఇరుకు – క్షేత్రస్థాయిలో పరిశీలన

హసన్‌పర్తి: రీపోటర్ ప్రణయ్ గొర్రె :16
సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుంచి సెయింట్ మేరీస్ పాఠశాల వరకు నిర్మిస్తున్న నూతన రహదారి పనుల్లో కొన్ని చోట్ల వెడల్పుగా, మరికొన్ని చోట్ల ఇరుకుగా నిర్మాణం చేపడుతున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వాహనదారులు, పాదచారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ విషయంపై జన్ను కిషన్ సంబంధిత అధికారులను ప్రశ్నించి, రహదారిని సరిసమానంగా వెడల్పుతో నిర్మించాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

సమస్యపై ఫోన్ చేయగానే స్పందించిన జీడబ్ల్యూఎంసీ ఈఈ రాజ్‌కుమార్ వెంటనే క్షేత్రస్థాయికి చేరుకుని రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్డు వెడల్పు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలపై దృష్టి సారించారు.

రహదారి నిర్మాణం పూర్తయ్యేలోపు సమస్యను పరిష్కరించి, సరిసమాన వెడల్పుతో సురక్షితమైన రాకపోకలకు అనువుగా రోడ్డును నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు