రైతు బజారుకు శంకు స్థాపన చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష
రైతు బజారుకు శంకు స్థాపన చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష పలాస ప్రజావాణి ప్రతినిధి పలాస మున్సిపాలిటీ పరిధిలోని మూడు రోడ్లు జంక్షన్ వద్ద రైతు బజార్ నిర్మాణానికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు తమ పంటలను వినియోగదారులకు నేరుగా విక్రయించేందుకు రైతు బజార్ ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులకు సరైన మార్కెట్ సదుపాయం కల్పించడంతో పాటు, పట్టణ ప్రజలకు తాజా కూరగాయలు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడం దీని లక్ష్యమని పేర్కొన్నారు....