prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 3:45 pm Digital Edition : PRAJA VANI

రైతు బజారుకు శంకు స్థాపన చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష

రైతు బజారుకు శంకు స్థాపన చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస ప్రజావాణి ప్రతినిధి

పలాస మున్సిపాలిటీ పరిధిలోని మూడు రోడ్లు జంక్షన్ వద్ద రైతు బజార్ నిర్మాణానికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు తమ పంటలను వినియోగదారులకు నేరుగా విక్రయించేందుకు రైతు బజార్ ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులకు సరైన మార్కెట్ సదుపాయం కల్పించడంతో పాటు, పట్టణ ప్రజలకు తాజా కూరగాయలు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడం దీని లక్ష్యమని పేర్కొన్నారు.
పలాస–కాశీబుగ్గ పట్టణంలో రైతులు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ బజార్‌ను అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించి, ప్రజలకు త్వరగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.రైతులకు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు అనువైన వేదిక ఏర్పడటం స్థానిక వ్యవసాయ రంగానికి తోడ్పడుతుందని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆశాభావం వ్యక్తం చేశారు.