రైతులకు 24 గంటల త్రీఫేస్ కరెంటు ఇవ్వాలి
రైతులకు 24 గంటల త్రీఫేస్ కరెంటు ఇవ్వాలి కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు-సీపీఎం బెజ్జంకి,సెప్టెంబర్ 30 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో రైతులకు త్రీఫేస్ విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడం లేదని, కరెంటు కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ అన్నారు.సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,బెజ్జంకి మండలంలో రైతులకు 7, 8 గంటలు కూడా త్రీఫేస్ విద్యుత్ అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు....