రైతులకు దారి కల్పించాలని ధర్నా
భద్రు తండా వద్ద జాతీయ గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆందోళన
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్ 23 ప్రజావాణి:
ఎలుకచెట్టు తండా: మండలంలోని ఎలుకచెట్టు తండా గ్రామపంచాయతీ పరిధిలోని భద్రు తండా వెనుక నుంచి జాతీయ గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో రైతులకు రాకపోకలకు దారి కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ధర్నా నిర్వహించారు.
సర్పంచ్ మాలోత్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో తండా రైతులు, ప్రజలు, యువకులు పాల్గొన్నారు. హైవేకు ఇరువైపులా తండా వాసుల వ్యవసాయ భూములు ఉండటంతో పొలాలకు వెళ్లేందుకు సరైన దారి లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులు, తండా వాసులతో మాట్లాడారు. తండా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ భూములకు దారి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యుడు బాదావత్ నరేష్, తండా రైతులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.