రైతులకు అధిక ఆదాయం.. దిగుమతి సుంకం తగ్గింపుతో నష్టం చేయొద్దు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

నంగునూరు, సెప్టెంబర్‌ 26 (ప్రజావాణి): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలోని ఆయిల్‌ఫామ్‌ ఫ్యాక్టరీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీలోని వివిధ విభాగాలను పరిశీలించి, ఆయిల్‌ఫామ్‌ రైతులతో మాట్లాడి పంట సాగు, దిగుబడి, ఆదాయం, మార్కెటింగ్‌ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీలో నీటి కొరత లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.   మూడు ఎకరాల్లో రూ.4.13 లక్షల ఆదాయం   ఆయిల్‌ఫామ్‌ సాగు చేస్తున్న రైతులతో మంత్రి మాట్లాడిన సందర్భంగా...