prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 9:05 am Digital Edition : RAJU CHELUKAPALLY CHENNARAOPET

రేషన్‌ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఐహెచ్‌ఆర్‌ఓ

రేషన్‌ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఐహెచ్‌ఆర్‌ఓ

చెన్నారావుపేట సెప్టెంబర్ 28 ప్రజావాణి

నర్సంపేట డివిజన్‌ పరిధిలోని రేషన్‌ దుకాణాల్లో జరుగుతున్న తూకం మోసాలు, బియ్యం పక్కదారి పట్టించే అక్రమాలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ (ఐహెచ్‌ఆర్‌ఓ) నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం నర్సంపేట ఆర్డీవోకు ఐహెచ్‌ఆర్‌ఓ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పాలకుర్తి విజయకుమార్‌, మహిళా అధ్యక్షురాలు గడ్డం సుభద్ర వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పేదలకు పూర్తిస్థాయిలో రేషన్‌ బియ్యం అందకుండా కొంతమంది డీలర్లు స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన, జవాబుదారీతనం కల్పించేందుకు ప్రతి రేషన్‌ షాపు వద్ద సంబంధిత సివిల్‌ సప్లై అధికారులు, తహసీల్దార్ల పేర్లు, ఫోన్‌ నంబర్లతో కూడిన సమాచార బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కోరారు.