prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 10:10 am Digital Edition : PRAJA VANI

రేపు ఎల్లుండి మిషన్ భగీరథ నీరు నిలిపివేత

రేపు ఎల్లుండి మిషన్ భగీరథ నీరు నిలిపివేత..
మిషన్ భగీరథ ఈఈ మాణిక్యరావు
ప్రజావాణి,ఇనుగుర్తి :మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలో రేపు ఎల్లుండి రెండు రోజులు ( శుక్ర,శనివారంఅక్టోబర్1, 2)పాటు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ ఈ ఈ మాణిక్యరావుతెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల కారణంగా ఇనుగుర్తి మండలంలో మిషన్ భగీరథ ద్వారా వచ్చే తాగునీటి సరఫరా తాత్కాలికంగా నిలిచిపోనుందని ఈ ఈ తెలిపారు.నీటి సరఫరా నిలిచిపోవడం వల్ల ప్రజలకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు గ్రామాల్లో టామ్‌టామ్ (దండోరా) ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి, ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని సూచించారు. రెండు రోజుల పాటు ప్రజలు ప్రత్యామ్నాయ స్థానిక వనరులు, నీటి సరఫరా మార్గాలను వినియోగించుకొని అధికారులకు సహకరించాలని సంబంధిత శాఖ అధికారులు కోరారు.