రేగులపల్లిలో ‘సురక్షా నేత్ర’ సీసీ కెమెరాల ప్రారంభం
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం- సీఐ విద్యాసాగర్
బెజ్జంకి, సెప్టెంబర్ 19 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని రేగులపల్లి గ్రామంలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా ‘సురక్షా నేత్ర’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ గ్రామంలో నేరాల నియంత్రణతో పాటు ప్రజల రక్షణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన గ్రామస్తులను అభినందించారు.ఈ కార్యక్రమంలో బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి, గ్రామ సర్పంచ్ జంగిటి లక్ష్మి, ఉపసర్పంచ్,గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.