రెండు ట్రాక్టర్లలో 60 టేకు మొద్దులు పట్టివేత! రూ.లక్షల విలువైన కలపకు రూ.10 వేల జరిమానాతోనే సరిపెట్టారా? పోరుమామిళ్ల అటవీ అధికారుల చర్యలపై అనేక ప్రశ్నలు..

కడప జిల్లా, పోరుమామిళ్ల: సెప్టెంబర్ 20 ప్రజావాణి పోరుమామిళ్ల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని టేకురుపేట సమీప అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో రెండు ట్రాక్టర్లలో తరలిస్తున్న టేకు మొద్దులను అటవీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. పట్టుకున్న వాహనాలను టేకు మొద్దులతో సహా పోరుమామిళ్ల ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు.ఒక్కో ట్రాక్టర్‌లో సుమారు 30 టేకు మొద్దులు చొప్పున మొత్తం 60 మొద్దులు ఉన్నట్లు ఉన్నాయి.భారీ మొత్తంలో టేకు కలప పట్టుబడిన నేపథ్యంలో అసలు ఈ మొద్దులు ఎక్కడి నుంచి వచ్చాయి?...