రిపోర్టర్‌తో ట్రాఫిక్ పోలీస్ దురుసు ప్రవర్తనపై విచారణ జరపాలి
రిపోర్టర్‌తో ట్రాఫిక్ పోలీస్ దురుసు ప్రవర్తనపై విచారణ జరపాలిప్రెస్ గుర్తింపు కార్డు చూపించినా స్పందించని తీరు.. “మీది ఆంధ్ర, మాది తెలంగాణ” అంటూ వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలుభద్రాచలం, సెప్టెంబర్ 17 (ప్రజావాణి ప్రతినిధి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విధి నిర్వహణలో ఉన్న ప్రజావాణి రిపోర్టర్‌తో ట్రాఫిక్ కానిస్టేబుల్ కే. ప్రసాద్ దురుసుగా ప్రవర్తించారని, ప్రెస్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించినప్పటికీ తన వాదనను పట్టించుకోకుండా మాట్లాడారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.