prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 5:38 pm Digital Edition : PRAJA VANI

రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ధూళిమిట్ట పాఠశాల విద్యార్థినులు

రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ధూళిమిట్ట పాఠశాల విద్యార్థినులు

దూలిమిట్ట మండల విద్యాశాఖాధికారి కర్ణాకర్ రెడ్డి

మద్దూరు సెప్టెంబర్ 18, ప్రజా వాణి,

ఇటీవల సిద్దిపేటలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెలక్షన్స్ లో పాల్గొని ప్రతిభ కనబరిచిన సుమేరా, మేఘన, హర్షిని మరియు భావన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనుముల కరుణాకర్ రెడ్డి తెలిపారు.విద్యార్థులు రేపటినుండి నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లిలో జరిగే 11వ సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులను మరియు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ వెగ్గళం సతీష్ కుమార్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు,గ్రామ సర్పంచ్, పాలకవర్గం ,ఉపాధ్యాయ బృందం మరియు గ్రామస్తులు అభినందించారు.