prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 6:27 am Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

రాష్ట్రస్థాయి టూరిజం బహుమతులకు ఎన్జీ కళాశాల విద్యార్థులు ఎంపిక నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి శనివారం

రాష్ట్రస్థాయి టూరిజం బహుమతులకు ఎన్జీ కళాశాల విద్యార్థులు ఎంపిక

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

శనివారం నల్గొండ జిల్లా టూరిజం డిపార్ట్ మెంట్ ఆఫీసర్ మహమ్మద్ అక్బర్ ఆలీ మాట్లాడుతూ ఒక ప్రకటన లో తెలుపుతూ శనివారం హైదరాబాద్, శిల్పారామంలో జరిగే టూరిజ వేడుకలకు రాష్ట్రస్థాయిలో సోషల్ మీడియా క్యాంపెయిన్ లో ప్రకటించగా నల్గొండ జిల్లాకు చెందిన నాగార్జున ప్రభుత్వ కళాశాల (అటానమస్ ) కళాశాలకు మూడు బహుమతులు దక్కాయి అని మొత్తం ఐదు కేటగిరీలలో పోటీలు జరగగా మొదటి కేటగిరీలో షార్ట్ ఫిలిం సోషల్ మీడియా విభాగంలో పి నిచ్చల,మూడవ కేటగిరీ అయిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విభాగంలో నాగార్జున ప్రభుత్వ కళాశాలకు చెందిన జ్యోత్స్న కు కమ్యూనిటీ ఆక్టివిటీలో నాగార్జున ప్రభుత్వ కళాశాలకు చెందిన బి నాగార్జున,మణి చరణ్, ఉదయ,రాఘవేంద్ర, శంకర్ టీం కు బహుమతులు తీసుకోబోతున్నారు తెలియజేశారు. ఈ బహుమతులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తీసుకు పోతున్నారని అన్నారని అన్నారు. ఈ సందర్భంగా నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ బహుమతులు తీసుకోబోతున్న విద్యార్థులను, జిల్లా యువ టూరిజం కోఆర్డినేటర్ నర్సింగ్ కోటయ్య ని అభినందించారు.