prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 3:37 pm Digital Edition : MEERASAHAB CHILUKUR

రాష్ట్రస్థాయి క్రికెట్‌కు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు

.రాష్ట్రస్థాయి క్రికెట్‌కు కోదాడ క్రీడాకారులు
కోదాడ: కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు షేక్ అర్హన్, గొర్రె చాణిక్య రాష్ట్రస్థాయి అండర్‌-16 ఇంటర్‌ స్కూల్‌ నాకౌట్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టు తరఫున వారు ప్రాతినిధ్యం వహించనున్నారు.
అండర్‌-16 ఇంట్రా డిస్ట్రిక్ట్‌ పోటీల్లో ఎడమచేతి ఫాస్ట్‌ బౌలర్‌ అర్హన్‌ అత్యధిక వికెట్లు సాధించగా, చాణిక్య లీగ్‌ దశలో సెంచరీతో ఆకట్టుకున్నాడు. వీరి ఎంపికతో కోదాడ క్రికెట్‌ అకాడమీలో ఆనందం వ్యక్తమైంది.
అకాడమీ కోచ్‌ షేక్‌ సిద్ధిఖ్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో నల్గొండ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. క్రీడాకారులకు అవకాశాలు కల్పిస్తున్న జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సయ్యద్‌ అమినోద్దిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
క్రీడాకారులను కోదాడ క్రికెట్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు సలీం షరీఫ్‌, అధ్యక్షుడు డాక్టర్‌ కొత్తపల్లి సురేష్‌, డాక్టర్‌ నందకిషోర్‌, ట్రెజరర్‌ ఖాజామియా, సతీష్‌, బడుగుల సైదులు, హమీద్‌, సురేష్‌, శంకర్‌, బుల్లయ్య, శ్రీకాంత్‌, శ్రీను, బాల్‌రాజు తదితరులు అభినందించారు. రాష్ట్రస్థాయిలో రాణించి కోదాడకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.