రాష్ట్రస్థాయి క్రికెట్‌కు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు
.రాష్ట్రస్థాయి క్రికెట్‌కు కోదాడ క్రీడాకారులు కోదాడ: కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు షేక్ అర్హన్, గొర్రె చాణిక్య రాష్ట్రస్థాయి అండర్-16 ఇంటర్ స్కూల్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్‌కు ఎంపికయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టు తరఫున వారు ప్రాతినిధ్యం వహించనున్నారు. అండర్-16 ఇంట్రా డిస్ట్రిక్ట్ పోటీల్లో ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ అర్హన్ అత్యధిక వికెట్లు సాధించగా, చాణిక్య లీగ్ దశలో సెంచరీతో ఆకట్టుకున్నాడు. వీరి ఎంపికతో కోదాడ క్రికెట్ అకాడమీలో ఆనందం వ్యక్తమైంది....