రామాపురం బాలుర ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు: జయప్రదం చేయాలని పిలుపు

కలసపాడు, సెప్టెంబర్ 23:ప్రజావాణి మండలంలో ఈనెల 30వ తేదీ నుండి ప్రారంభం కానున్న మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) క్రీడా పోటీలను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని ఎస్జీఎఫ్ మండల కోఆర్డినేటర్ సురేష్ రవి మరియు ఎగవ రామాపురం హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మెర్సి మాలిని పిలుపునిచ్చారు. గురువారం ఎగవ రామాపురం ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, మరియు ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుల (పీఈటీలు) అత్యవసర సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు మెర్సి మాలిని అధ్యక్షతన...