prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 9:17 am Digital Edition : PRAJA VANI

రాప్తాడులో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు జన నీరాజనం

రాప్తాడులో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు జన నీరాజనం

రాప్తాడు నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ కు రాప్తాడు కూడలిలో అపూర్వ స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు..

అనంత పురం బ్యూరో సెప్టెంబర్ 22 మన ప్రజా వాణి
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు..
పెద్దఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు..
మంత్రి లోకేష్ రాకను పురస్కరించుకుని పెద్దఎత్తున బాణసంచా కాల్చి, డప్పులతో శ్రేణుల సంబరాలు..రాప్తాడు సర్కిల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన మంత్రి నారా లోకేష్..పరిటాల శ్రీరామ్ తో కలిసి వాహనం పైకి ఎక్కి ప్రజలకు, పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్..భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి లోకేష్*అనంతరం రాప్తాడు సర్కిల్ లో స్వర్గీయ ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి లోకేష్..మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ నేను ఇక్కడ వేదికపై ఉన్నానంటే దానికి కారణం ఎదురుగా ఉన్న నమ్మకమైన తెలుగుదేశం కార్యకర్తలే. నేను ఎన్‌టీఆర్ మనవడిగానో, సీఎం చంద్రబాబు నాయుడు తనయుడిగానో కాకుండా, పసుపు జెండాను గుండెల్లో మోసే సాధారణ కార్యకర్తగా మీ ముందుకు వచ్చాను. అనంతపురం జిల్లా ఎప్పుడూ టీడీపీకి అండగా నిలిచింది. ఎన్టీఆర్ గారిని, హరికృష్ణ గారిని, బాలకృష్ణ ని గెలిపించి అసెంబ్లీకి పంపిన ఘనత ఈ నేలది. పరిటాల రవి గారు కార్యకర్తల కోసం ఎల్లప్పుడూ అండగా నిలబడ్డారు. వారు చూపిన ధైర్యం, క్రమశిక్షణతో మనమందరం కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నారు.ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడులో ఎన్టీఆర్, పరిటాల రవి గారి విగ్రహాలు ఏర్పాటు చేయాలని కార్యకర్తలు దాదాపు 20 ఏళ్లుగా కోరుతున్నారు. ఆ నిరీక్షణ ఈరోజుతో నెరవేరింది. మేము విగ్రహాల ఆవిష్కరణకు ఆహ్వానించగానే మంత్రి లోకేష్ బాబు వెంటనే అంగీకరించి ఇక్కడికి రావడం ఎంతో ఆనందదాయకం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాయలసీమకు కృష్ణా జలాలు, పరిశ్రమలు, సంక్షేమ పథకాలు వచ్చాయి అని అన్నారు.