prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 6:29 pm Digital Edition : SRIKANTH MULUGU

రాజీ మార్గంలో కేసులకు ముగింపు

 

.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే. చండీశ్వరి దేవి వెల్లడి.

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి):

జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని కోర్టులలో ఈ నెల *12-09-2026 (శనివారం)* రోజున *”జాతీయ లోక్ అదాలత్”* నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి *కే. చండీశ్వరి దేవి* ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడదగు క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ప్రీ-లిటిగేషన్ కేసులు, బ్యాంక్ కేసులు, విద్యుత్ కేసులు, భూతగాదా కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదాల కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు మరియు ఇతర రాజీపడదగు అన్ని కేసులను పరిష్కరించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
కావున కక్షిదారులందరూ సెప్టెంబర్ 12న జరగనున్న లోక్ అదాలత్ కు హాజరై తమ కేసులను పరిష్కరించుకోవాలని, ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.