prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 4:48 pm Digital Edition : PRAJA VANI

రాజారాంపేట”వినాయకుడి లడ్డు పాట 80000

రాజారాంపేట”వినాయకుడి లడ్డు పాట 80000

లడ్డు పాట కైవసం చేసుకున్న కంటు రామయ్య మనవళ్ళు

నేలకొండపల్లి ప్రతినిధి, మన ప్రజావాణి సెప్టెంబర్ 23 బుధవారం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని రాజారాంపేట గ్రామపంచాయతీలో ముదిరాజ్ యూత్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహం వద్ద బుధవారం ప్రతిష్టాత్మకంగా లడ్డుపాట నిర్వహించారు. ఈ లడ్డు పాటలో గ్రామానికి చెందిన కంటూ రామయ్య మనవళ్లు గోనెల ఉపేందర్ కంటు గోపి గోనెల వెంకటేశ్వర్లు కంటూ వీరస్వామి గణవరపు వీరబాబు 80 వేల రూపాయలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామస్తులు వార్డు మెంబర్లు భక్తులు పాల్గొన్నారు. కాగా పెన్ను పాటను గోనెల ఉపేందర్ 16,500 రూపాయలకు దక్కించుకున్నారు.