*రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ హత్య*
••భార్యను కత్తులతో పొడిచి చంపిన భర్త..
•• అడ్డుకున్న అత్తపైనా దాడి.
ఎల్లారెడ్డిపేట, ప్రజావాణి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో భార్య జ్యోతిని ఆమె భర్త సురేష్ కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేసినట్లు సమాచారం.
భార్య గొంతు, కడుపు, చేతులపై కత్తితో తీవ్రంగా దాడి చేయడంతో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అత్త ఎల్లవ్వపై కూడా సురేష్ కత్తితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ఎల్లవ్వను చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు.
*కుటుంబ కలహాలే కారణమా*?
కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హత్యకు గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
*ఘటన స్థలంలో పోలీసులు*
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

