రాజంపేటలో ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు: బాల్య వివాహాలు, మొబైల్ వాడకంపై న్యాయమూర్తుల కీలక సూచనలు
రాజంపేట: సెప్టెంబర్ 19 ప్రజావాణి విద్యార్థులు చిన్నతనం నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ చట్టబద్ధమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీ యస్. ప్రవీణ్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జి పి.రాజన్ ఉదయ్ ప్రకాశ్ పిలుపునిచ్చారు. రాజంపేట మండల న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఇన్ఫాంట్ జీసస్ స్కూల్ నందు శనివారం "బాలల హక్కులు - బాలల సంబంధాలు" అనే అంశంపై న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సును అత్యంత ఘనంగా...