prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 3:11 pm Digital Edition : MAHESH MEDCHAL

*రాంపల్లి జై మాతా యూత్ గణేశ్ మండపాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు*

*రాంపల్లి జై మాతా యూత్ గణేశ్ మండపాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు*

మేడ్చల్ కీసర, సెప్టెంబర్ 21

మేడ్చల్ జిల్లా: నాగారం డివిజన్‌ పరిధిలోని రాంపల్లిలో జై మాతా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాన్ని సోమవారం పోలీసు అధికారులు సందర్శించి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు , ట్రాఫిక్ ఎస్‌ఐ శివశంకర్, కీసర ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్‌ఐ అనిల్ మండపాన్ని సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టిన భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు, ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని నిర్వాహకులు కోరారు.