రసాభాసగా రైతు సేవా సహకార సంఘం సర్వసభ్య సమావేశం..రుణమాఫీపై రైతుల నిలదీత.. పాలకవర్గం రాజీనామాకు డిమాండ్..పోలీసుల జోక్యంతో అర్ధాంతరంగా ముగిసిన సమావేశం

ఘట్‌కేసర్ రైతు సేవా సహకార సంఘం 46వ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. అర్హులైన రైతులకు రుణమాఫీ చేయించడంలో పాలకవర్గం విఫలమైందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాలకవర్గ సభ్యులు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సమావేశంలో వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. సోమవారం నారాయణ గార్డెన్స్‌లో సంఘం చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది...