prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 4:52 pm Digital Edition : PRAJA VANI

రవీందర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వివేక్

రవీందర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వివేక్

మందమర్రి తెలంగాణ ఉద్యమకారులు బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ నాయకులు జె రవీందర్ ఇటీవల అకాల మరణం చెందడంతో వారి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు రవీందర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు అనంతరం మంత్రి వెంకటస్వామి మాట్లాడుతూ రవీందర్ తో ఉద్యమ సమయంలో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రవీందర్ ఎంతో నిబద్ధతతో పనిచేశారని తెలిపారు రవీందర్ రాజకీయాల్లో అజ్ఞాత శత్రువు అని హుందాగా రాజకీయాల్లో కొనసాగారని తెలిపారు రాజకీయాలతో సంబంధం లేకుండా వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.